అధ్యక్ష ఎన్నికల్లో ఇద్దరికీ రికార్డులే!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేత జో బైడెన్, ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ రికార్డులు సాధించారు. చరిత్రలో అత్యధిక పాపులర్ ఓట్లు సాధించిన తొలి నేతగా బైడెన్ ఖ్యాతి గడించారు. పాపులర్ ఓట్లలో రెండోస్థానంలో నిలిచిన అభ్యర్థిగా ట్రంప్ రికార్డు సొంతం చేసుకున్నారు. బైడెన్‌కు 8 కోట్ల 11 వేల ఓట్లు వచ్చాయి. ఇంకా కొన్ని చోట్ల లెక్కింపు పూర్తి కాకపోవడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధ్యక్ష అభ్యర్థి 8 కోట్లకు పైగా ఓట్లను పొందడం ఇదే తొలిసారి. ట్రంప్‌నకు 7 కోట్ల 38 వేల ఓట్లు పడ్డాయి. చరిత్రలో ఇన్నేసి ఓట్లు పొందిన అభ్యర్థులు ఎవరూ లేరు. 2016 ఎన్నికల్లో ట్రంప్‌నకు 6 కోట్ల 29 వేల ఓట్లు వచ్చాయి. గతంలో కన్నా ఎక్కువ ఓట్లను పొందడం విశేషం. ఇంతవరకు గెలిచిన అధ్యక్షులు ఎవరికీ 7 కోట్ల ఓట్లు రాలేదు. అందుకే ఓడినా ట్రంప్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిగా నిలిచారు. ఓట్ల సంఖ్య పెరగడంతో పాటు, ఎక్కువ మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవడం కారణంగా అధికంగా పోలింగ్ జరిగింది.






