J.D. Vance: అది మా పని కాదు.. అమెరికా ఉపాధ్యక్షుడు

భారత్-పాక్ మధ్య జరుగుతున్న సైనిక ఘర్షణలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జేడీ వాన్స్(J.D. Vance) మాట్లాడుతూ రెండు అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం రావడంపై మేమే ఆందోళన చెందుతున్నాం. వీలైనంత తొందరగా పరిస్థితులు శాంతించాలని కోరుకుంటున్నాం. పాకిస్థాన్ (Pakistan)పై భారత్ (India )కు కొన్ని ఫిర్యాదులున్నాయి. న్యూఢల్లీి చర్యలకు పాక్ స్పందిస్తోంది. పరిస్థితులు తగ్గుముఖం పట్టేలా చేయాలని మేము వీరిని ప్రోత్సహించగలం. కానీ, యుద్ధంలో మాత్రం తలదూర్చం. అది మా పని కాదు. అమెరికా (America)తో దానికి ఏమాత్రం సంబంధం లేదు అని వ్యాన్స్ వెల్లడిరచారు.