J.D. Vance:చైనా విషయంలో ట్రంప్ నిర్ణయం తీసుకోలేదు : జేడీ వాన్స్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న చైనా (China)పై ప్రతీకార సుంకాలు విధించాలా? వద్దా అన్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) వెల్లడిరచారు. సుంకాల విషయంలో చైనా సమస్య కొంచెం సంక్లిష్టంగా ఉంటుందన్నారు. రష్యా(Russia) నుంచి చమురు కొనుగోలుతో ముడి పెట్టలేని అనేక ఇతర అంశాలు అమెరికా-చైనా సంబంధాలను ప్రభావితం చేస్తాయని ఆయన తెలిపారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై ట్రంప్ అదనపు సుంకాలతో విరుచుకుపడ్డారు. చైనా కూడా రష్యా నుంచి భారీగా చమురు దిగుమతి చేసుకుంటోంది. మరి చైనాపై ప్రతీకార సుంకాలు విధిస్తారా? లేదా అన్న ప్రశ్నకు వాన్స్ ఈ విధంగా స్పందించారు.