Italian Prime Minister :ట్రంప్ తో ఇటలీ ప్రధాని మెలోని భేటీ
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )మరికొన్ని రోజుల్లో అధికార బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని(Georgia Meloni) ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఫ్లోరిడాలోని మార్-ఎ-లాగో ఎస్టేట్ లో ఈ ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇది సంతోషకరమైన సమయం. అద్భుతమైన మహిళ, ఇటలీ ప్రధానితో ఉన్నాను అని ట్రంప్ అక్కడి వారితో పేర్కొన్నారు. ఇరువురి నేతల సమావేశానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. అయితే ఉక్రెయిన్ (Ukraine) తో రష్యా యుద్ధం, వాణిజ్య సమస్యలు, మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలతో పాటు ఇరాన్ లో నిర్బంధించిన ఇటాలియన్ జర్నలిస్టు విడుదల వంటి అంశాలను గురించి చర్చించినట్లు తెలుస్తోంది.






