డొనాల్డ్ ట్రంప్ తో నెతన్యాహు భేటీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సుమారు నాలుగేళ్ల తరవాత అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫ్లోరిడాలోని పాం బీచ్‌లో గల తన నివాస సౌధం మార్ ఏ లాగో ఎస్టేట్‌లో నెతన్యాహుకు ట్రంప్ సాదర స్వాగతం పలికారు. 2020లో అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా జో బైడెన్‌కు నెతన్యాహు అభినందనలు తెలిపినప్పటి నుంచి ట్రంప్‌తో ఆయనకు విభేదాలేర్పడ్డాయి. 9 నెలల క్రితం హమాస్‌తో ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక తొలిసారి నెతన్యాహు అమెరికాలో పర్యటించారు. ఈ క్రమంలోనే ఆయన ఇంతకు ముందే అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో సమావేశమయ్యారు.






