అమెరికా ఎన్నికల్లో ఇరాన్ జోక్యం
అమెరికా ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ఇరాన్ యత్నిస్తోందని ప్రముఖ టెక్ కంపెనీ మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. ఆ దిశగా ఈ మధ్య ఆన్లైన్ కార్యకలాపాలు పుంజుకున్నట్లు తెలిపింది. ఎన్నికల ప్రచారాలే లక్ష్యంగా ఈ మెయిల్ ఫిషింగ్ వంటివి అందులో ఉన్నట్లు పేర్కొంది. ఇరాన్‌కు చెందిన కొన్ని బృందాలు గతకొన్ని నెలలుగా దీనిపైనే పనిచేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. నకిలీ వార్త వెబ్సైట్ల సృష్టి, సామాజిక కార్యకర్తల్లా అనుకరణ వంటి మార్గాల్లో ఓటర్ల మధ్య విభజన కోసం యత్నిస్తున్నారని తెలిపింది. ముఖ్యంగా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే కీలక రాష్ట్రాలపైనే దృష్టి సారించినట్లు పేర్కొంది. ఈ మేరకు సమర్పించిన నివేదికలో ఈ తరహా కార్యకలాపాలకు పాల్పడుతున్న బృందాలు, అవి అనుసరిస్తున్న విధానాలను మైక్రోసాఫ్ట్ కచ్చితగా పేర్కొనడం గమనార్హం. ఈ చర్యల వెనక ఇరాన్ ఉద్దేశాన్ని మాత్రం వెల్లడించలేదు.






