Texas: టెక్సాస్ సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల విజయం

అమెరికాలోని టెక్సాస్ (Texas)లో జరిగిన సిటీ కౌన్సిల్ ఎన్నికల్లో (City Council Election) ఇద్దరు భారతీయ అమెరికన్ అభ్యర్థులు గెలుపొందారు. సుగర్‌ల్యాండ్ డిస్ట్రిక్ట్- 2 నుంచి సంజయ్ సింఘాల్ (Sanjay Singhal), శాన్ ఆంటోనియో డ్రిస్టిక్ -1 నుంచి సుఖ్ కౌర్ (Sukh Kaur )విజయం సాధించారు. సింఘాల్ కు 2,346 ఓట్లు రాగా, కౌర్ కు 65 శాతం ఓట్లు వచ్చాయని ఫోర్ట్ బెండ్ కౌంటీ అధికారులు (Fort Bend County) ప్రకటించారు. ఈ సందర్భంగా ఓటర్లకు సంజయ్ సింఘాల్, సుఖ్ కౌర్ కృతజ్ఞతలు తెలిపారు.