Donald Trump: డొనాల్డ్ ట్రంప్ నోట మళ్లీ అదే పాట

జీరో టారిఫ్‌ల విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ప్రస్తావించారు. అమెరికా (America) నుంచి దిగుమతి చేసుకొనే చాలారకాల వస్తువులపై భారత్ జీరో టారిఫ్ (Zero tariff) లను ఆఫర్ చేసిందని మరోసారి పునరుద్ఘాటించారు. భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ నుంచి పదేపదే ఈ వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంటు న్నాయి. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్ల భారత్ (India) ఒకటి అని మరోమారు వ్యాఖ్యానించారు. తమ దేశం నుంచి దిగుమతి చేసేకొనే వస్తువులపై సుంకాల్ని 100 శాతం తగ్గించడానికి భారత్ అంగీకరించిందన్నారు. ఇక భారత్‌తో వాణిజ్య ఒప్పందం గురించి తొందరలేదని, తమతో ఒప్పందం కుదుర్చుకొనేందుకు అందరూ ఆసక్తి చూపుతున్నారని తెలిపారు.