Hush money case : హష్ మనీ కేసు … సుప్రీంకోర్టులో ట్రంప్ నకు నిరాశ
హష్మనీ కేసు (Hush money case )లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )నకు ఊరట లభించలేదు. ఈ కేసులో తనకు శిక్షను ఖరారు చేస్తూ జారీ కానున్న ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని న్యూయార్క్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ తిరస్కరించింది. ట్రంప్ తరపు న్యాయవాదుల వాదనలు వినేందుకు అంగీకరించలేదు. అయితే ఈ అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు (Supreme Court ) ను ట్రంప్ ఆశ్రయించారు. హష్మనీ కేసులో న్యూయార్క్ కోర్టుల జడ్జి జువాన్ ఎం. మెర్చన్ (Juan M. Merchant) ట్రంప్‌నకు శిక్షను ప్రకటించనున్నారు.






