Donations :ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారీగా విరాళాలు
అమెరికా తదుపరి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఇప్పటి వరకు కనీవినీ ఎరుగని రీతిలో సుమారు రూ.1,459 కోట్లు ( 170 మిలియన్ డాలర్లు) విరాళాలు రాబట్టారు. టెక్ సంస్థ (Tech company ) ల ఎగ్జిక్యూటివ్‌లు, బడా దాతలు భూరి విరాళాలతో కూడిన చెక్‌లను అందించారు. ట్రంప్ ప్రమాణ స్వీకార ఏర్పాట్ల కమిటీ చివరకు రూ.1,716 కోట్ల కంటే ఎక్కువ నిధులను సేకరించే అవకాశం ఉందని కమిటీ సభ్యుడొకరు వెల్లడించారు. ఈ నిధులను ఏ విధంగా వెచ్చించాలనే ప్రణాళిక ఏదీ ఇప్పటి వరకు కమిటీ వద్ద లేదని సమాచారం. ఈ నెల 20న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.






