Donald Trump : కరోలిన్ లీవిట్ పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

వైట్‌హౌస్ ప్రెస్ (White House Press Secretary) సెక్రటరీ కరోలిన్ లీవిట్ (Carolyn Leavitt) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికాకు అధ్యక్షుడిగా సేవలు అందించిన అందరు అధ్యక్షుల్లో తనకు మాత్రమే అద్భుతమైన, ఉత్తమ ప్రెస్ సెక్రటరీ ఉందని అన్నారు. కరోలిన్ లీవిట్ మెషీన్‌గన్‌లా పనిచేస్తూ, తన విధులను సమర్థవంతంగా నిర్వర్తిస్తోందన్నారు. అందం, హుందాతనంతో ప్రజల్లో ఓ స్టార్ (Star ) గా మారిపోయిందని పేర్కొన్నారు. కరోలిన్ మాట్లాడేటప్పుడు ఆమె పెదాల కదలికి చాలా అందంగా ఉంటుందని పొగిడారు.