Harvard University: హార్వర్డ్‌కు ఆరు షరతులు … ఒప్పుకోకుంటే నిషేధమే

హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) పై ఆంక్షలకు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సర్కారు మరింగా పదును పెడుతోంది. హార్వర్డ్‌లో విదేశీ విద్యార్థుల ప్రవేశానికి వీలు కల్పించే యూనివర్సిటీ స్టూడెంట్ ఎక్సేంజ్ విజిటర్ ప్రోగ్రాం (ఎస్‌ఈవీపీ) సర్టిఫికేషన్‌ను తాజాగా రద్దు చేయడం తెలిసిందే. దాన్ని పునరుద్ధరించాలంటే ఆరు కఠినమైన షరతులను పాటించాలంటూ వర్సిటీపై ఒత్తిడి తెస్తోంది. గత ఐదేళ్లలో విదేశీ విద్యార్థులు క్యాంపస్‌లో లేదా వెలుపల పాల్పడ్డ చట్టవిరుద్ధ, ప్రమాదకర, హింసాత్మక కార్యకలాపాలు, ఇతర విద్యార్థులపై లేదా సిబ్బందిపై బెదిరింపులు, క్యాంపస్ (Campus) లో లేదా బయట ఇతర క్లాస్‌మేట్స్ లేదా వర్సిటీ సిబ్బంది హక్కులను హరించడం వంటివాటికి సంబంధించిన అన్ని రికార్డులనూ తక్షణం ప్రభుత్వానికి అందజేయాలి.
గత ఐదేళ్లలో వలసేతర క్రమశిక్షణ రికార్డులు సమర్పించాలి. క్యాంపస్‌లో వలసేతర విద్యార్థులు నిరసన కార్యకలాపాల్లో పాల్గొని ఉంటే అందుకు సంబంధించిన అన్నిరకాల ఆడియో(Audio) , వీడియో (video) పుటేజ్‌లు, అధికారిక, అనధికారిక రికార్డులన్నీ సమర్పించాలి అని డీహెచ్‌ఎస్ స్పష్టం చేసింది. ఇందుకు 72 గంటల గడువు విధించింది. హింస, యూదు వ్యతిరేకత, క్యాంపస్‌లో చైనా కమ్యూనిస్ట్ పార్టీతో సమన్వయం వంటి వాటికి హార్వర్డ్ బాధ్యత వహిస్తోంది. అందుకే విదేశీ విద్యార్థులను చేర్చుకునే అర్హత కోల్పోయింది. చట్టాన్ని పాటించడంలో విఫలమైంది. వర్సిటీపై దర్యాప్తు కొనసాగుతోంది. అందుకే సర్టిఫికేషన్ రద్దు చేశాం అని డీహెచ్‌ఎస్ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ అన్నారు. హార్వర్డ్‌కు ఎస్‌ఈవీపీ సర్టిఫికేషన్ రద్దుపై ఫెడరల్ కోర్టు తాజాగా స్టే విధించింది.