Harvard University: మరోసారి హార్వర్డ్ వర్సిటీకి నిధుల కోత

ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయాని (Harvard University)కి అందించే నిధుల్లో మరోసారి కోత విధిస్తూ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజాగా ప్రభుత్వ ఆరోగ్య, మానవ సేవల విభాగం అందించే 450 మిలియన్ డాలర్ల గ్రాంట్లను నిలిపివేసింది. హార్వర్డ్ ఉదారవాదం, యూదు వ్యతిరేకతకు నిలయంగా మారిందని ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను వర్సిటీ అధ్యక్షుడు అలాన్ గార్బర్ (Alan Garber) తిప్పికొట్టిన మరుసటి రోజే ఈ నిధులకు గండి పడటం గమనార్హం. గతంలో స్తంభింపజేసిన 2.2 బిలియన్ డాలర్లకు తాజా కోత అదనమని అధికారులు పేర్కొన్నారు. దీంతో ట్రంప్ యంత్రాంగంపై హార్వర్డ్ కోర్టు (Court) లో దావా వేసింది. అమెరికా ప్రభుత్వం తమ విశ్వవిద్యాలయ కార్యకలాపాలలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించింది.