గాజాలో యుద్ధాన్ని ఆపండి.. నెతన్యాహుకు స్పష్టంచేసిన హారిస్
హమాస్‌తో తక్షణ కాల్పులు విరమణ ఒప్పందం కుదుర్చుకొని గాజాలో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ తనను తాను రక్షించుకొనే హక్కు ఉంది. కానీ అది ఎలా చేస్తుందన్నది కూడా కీలకమే. గత తొమ్మిది నెలలుగా గాజాలో విధ్వంసం జరుగుతోంది. అక్కడ జరుగుతున్న మానవ సంక్షోభంపై నా ఆందోళన వ్యక్తం చేశాను. ఈ విషాదాన్ని చూడనట్లు ఉండలేం. దీనిపై నేను మౌనంగా ఉండలేను అని నెతాన్యాహుతో సమావేశానంతరం మీడియాతో మాట్లాడుతూ హారిస్ ఈ వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనా సమస్యకు ద్విదేశ పరిష్కారమే మార్గమని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.






