Donald Trump :24 గంటల్లో భారత్‌పై.. మళ్లీ ట్రంప్ బెదిరింపు!

రష్యా నుంచి చమురు కొనుగోళ్లపై భారత్ వెనక్కి తగ్గని నేపథ్యంలో మరింత భారీగా సుంకాలు విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ భారత్ అత్యధిక సుంకాలు వసూలు చేసే దేశం. అన్నిదేశాల కంటే కూడా ఎక్కువ. భారత్ మంచి వాణిజ్య భాగస్వామి కాదు. వాళ్లు అమెరికా (America)తో చాలా వ్యాపారం చేస్తారు. కానీ అధిక సుంకాల కారణంగా భారత్ (India )తో అమెరికా పెద్దగా వ్యాపారం చేయలేదు. అందుకే భారత్‌పై 25శాతం సుంకాలు విధించాం. వచ్చే 24 గంటల్లో ఈ సుంకాలను మరింత భారీగా పెంచబోతున్నాను. రష్యా నుంచి భారత్ చమురు కొంటుండటమే దీనికి కారణం. దీనితో ఉక్రెయిన్ (Ukraine)పై యుద్ధం కోసం రష్యాకు అవసరమైన నిధులు అందుతున్నా యి. ఇది నాకు ఇష్టం లేదు అని ట్రంప్ పేర్కొన్నారు. నిజానికి భారత్ తమ టారి్‌ఫలను సున్నాకు తగ్గించినా కూడా సరిపోదని.. వారు చమురు విషయంలో చేస్తున్న పని సరికాదని వ్యాఖ్యానించారు. రష్యా చమురు కొనుగోళ్ల అంశంలో అమెరికా, యూరోపియన్ యూనియన్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయంటూ భారత్ ఎండగట్టిన తర్వాత కూడా ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.