ట్రంప్‌ను ద్వేషించేవారి కోసం … నాలుగేళ్ల పర్యాటక ప్యాకేజీ
డొనాల్డ్ ట్రంప్ పాలనలో అమెరికాలో ఉండలేం బాబోయే అనే స్థాయిలో ట్రంప్‌ను ద్వేషించేవారి కోసం అమెరికాకు చెందిన విల్లా వై రెసెడిన్సెస్ అనే లగ్జరీ క్రూయిజ్ సంస్థ నాలుగేళ్ల ప్రపంచ ట్రిపును ప్రకటించింది. ఈ ట్రిప్పునకు స్కిప్ ఫార్వార్డ్ అనే పేరు పెట్టింది. అంటే ఈ క్రూయిజ్‌లో వెళ్లేవారు తిరిగి అమెరికాకు వచ్చేసరికి ట్రంప్ నాలుగేళ్లపాలన పూర్తయి ఉంటుందన్నమాట. ట్రిప్పులో భాగంగా ప్రయాణికులను విల్లా వై ఒడెస్సీ అనే క్రూయిజ్‌లో నాలుగేళ్లపాటు ప్రపంచంలోని ఏడు ఖండాల్లోని 400 ప్రముఖ పర్యాటక ప్రదేశాలను తిప్పుతారు. టికెట్ ధరలు మన కరెన్సీలో రూ.1.35 కోట్ల నుంచి (డబుల్ ఆక్యుపెన్సీ-ఒకే గదిలో ఇద్దరుంటే), రూ.2.2 కోట్ల దాకా (సింగిల్ ఆక్యుపెన్సీ) ఉన్నాయి. ఇది కేవలం ట్రంప్ ద్వేషుల కోసమే ఉద్దేశించింది కాదని, ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారి వ్యతిరేకులు ప్రశాంతత కోసం అలా తిరిగొచేచందుకే ఎన్నికలకు ముందే ఈ ప్యాకేజీని రూపొందించామని విల్లా వై సీఈవో మైకేల్ పీటర్సన్ తెలిపారు. నాలుగేళ్ల ప్రయాణించలేని వారుంటే ఏడాది, రెండు, మూడేళ్ల ప్యాకేజీలూ ఉన్నాయన్నారు.






