Donald Trump : హార్వర్డ్‌పై విజయం సాధిస్తా : డొనాల్డ్ ట్రంప్

హార్వర్డ్ వర్సిటీ (Harvard University) పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యుద్ధం ప్రకటించారు. ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని కూడా ఆయన తెలిపారు. యూదు వ్యతిరేక హార్వర్డ్‌కు ఇచ్చే గ్రాంట్లలో మూడు బిలియన్ డాలర్ల మేర కోత విధించాలని అనుకుంటున్నాం. వాటిని దేశంలోని ఇతర డ్రేడ్ స్కూళ్లకు మళ్లిస్తాం అని పేర్కొన్నారు. విదేశీ విద్యార్థులు చెల్లించే ట్యూషన్ ఫీజు (Tuition fees )లే హార్వర్డ్‌కు పెద్ద ఆదాయ వనరు కావడంతో వాటిపైనా దృష్టి పెట్టారు. విదేశీ విద్యార్థుల జాబితా ఇవ్వాలని అడిగినట్టు తెలిపారు. ఆ జాబితా వస్తే దేశంలోకి ఎంతమంది రాడికల్ పిచ్చోళ్లు, సమస్యలను సృష్టించే వారు వస్తున్నారో తెలుసుకోవచ్చు. బిలియన్ల కొద్దీ డాలర్లను ఇలాంటి పనికిమాలిన వారి కోసం ఖర్చు పెడుతున్నాం. అయినా భయం లేదు. ప్రభుత్వం విజయం సాధిస్తుంది అని పేర్కొన్నారు. హార్వర్డ్ విదేశీ విద్యార్థులు చేరకుండా ఆదేశాలు ఇచ్చినప్పటికీ న్యాయస్థానం దాన్ని సస్పెండ్ చేయడం గమనార్హం. ట్రంప్ నిర్ణయంతో భారతీయ విదార్థుల్లో (Indian students) ఆందోళన నెలకొంది.