Elon Musk: వెనక్కు తగ్గిన మస్క్ .. ఆయనతో మళ్లీ స్నేహస్తం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )పై మాటల యుద్ధానికి దిగిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వెనక్కు తగ్గారు. ఆయనతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో పడ్డారు. ట్రంప్‌ను విమర్శిస్తూ కొద్ది రోజుల క్రితం తాను చేసిన సోషల్ మీడియా (Social media) పోస్టుల పట్ట విచారణం వెలిబుచ్చారు. ట్రంప్‌పై పెట్టిన కొన్ని పోస్టుల విషయంలో బాధపడుతున్నా. అవనవసరంగా అతి చేశా అంటూ మస్క్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. కానీ ట్రంప్ మాత్రం ఈ విషయంలో తగ్గేలా కన్పించడం లేదు. మస్క్‌తో సంబంధాలను సరిచేసుకునే ఉద్దేశం కూడా తనకు లేదని కొద్ది రోజులుగా మీడియా ప్రశ్నలకు బదులుగా ఆయన పదేపదే స్పష్టం చేస్తూ వస్తున్నారు.