Elon Musk : వైట్ హౌస్ డేటా కొట్టేసిన ఎలాన్ మస్క్!

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలో పనిచేసిన డోజ్ (Doze) బృందం వైట్ హౌస్ ( White House)లోని డేటాను భారీగా యాక్సెస్ చేసింది. ఈ డేటా ట్రాన్‌మిషన్ గోప్యంగా జరిగింది. దీనికి రికార్డులు కానీ, ఏ విధంగా ట్రాన్స్‌మిషన్ అయిందో గుర్తించే అవకాశం కానీ లేకుండా పోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అడ్మినిస్ట్రేషన్ అనుమతితోనే ఇదంతా జరిగింది. అంతర్గత భద్రతాధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ, డోజ్ టీమ్స్ పట్టించుకోలేదు. వైట్‌హౌస్ డేటా (Data)ను మస్క్ కాపీ చేశారన్న ఆరోపణలను అమెరికన్ సీక్రెట్ సర్వీస్ తోసిపుచ్చింది. అయితే డోజ్ టీమ్‌పై ఈ తరహా ఆరోపణలు కొత్త కాదు.