ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై గూగుల్ సెర్చ్ బ్యాన్‌ను విధించిందని తద్వారా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తలదూరుస్త్తోందని ఆరోపించారు. అదేగనుక నిజమైతే సుందర్ పిచాయ్ సీఈవోగా వ్యవహరిస్తున్న గూగుల్‌కు మున్ముందు కష్టాలు తప్పవని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అని టైప్ చేయగా.. గూగుల్‌లో ప్రెసిడెంట్ డొనాల్డ్ డక్, ప్రెసిడెంట్ డొనాల్డ్ రిగన్ అని రావడాన్ని ఆయన స్క్రీన్ షాట్స్ తీసీ షేర్ చేశారు. అయితే మస్క్ పోస్టుకు మిశ్రమ స్పందన వస్తోంది. కొందరు సమర్థిస్తుండగా, మీరు కూడా ఎక్స్‌లో చాలా అకౌంట్లపై ఆంక్షలు విధించలేదా అని కొందరు మిమర్శిస్తున్నారు.






