America : అమెరికా నుంచి ఇక్కడకు పంపే డబ్బుపై 5శాతం పన్ను!

అమెరికా నుంచి భారత్‌లోని కుటుంబీకులకు డబ్బులు పంపే భారతీయుల (Indians)పై 5 శాతం పన్ను భారం పడనుంది. అమెరికా పౌరులు మినహా హెచ్-1బీ వీసాదార్లు (H-1B visa), గ్రీన్‌కార్డు (Green card) హోల్డర్లు విదేశాలకు పంపే నిధులపై ఈ పన్ను వేయాలన్నది డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రతిపాదన. అక్కడ నివసిస్తున్న భారతీయులు పంపుతున్న నిధుల ప్రకారం చూస్తే ఈ పన్ను భారం ఏడాదికి 1.6 బిలియన్ డాలర్లు ( దాదాపు 13,600 కోట్లు ) కావొచ్చు.