Jinping : జిన్‌పింగ్‌తో డొనాల్డ్ ట్రంప్ చర్చలు

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబోతున్న డొనాల్డ్ ట్రంప్ (Donald trump) చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ (Jinping)తో ఫోన్‌లో మాట్లాడారు. వ్యాపారం, వాణిజ్యం, టిక్‌టాక్ (TikTok) తదితర అంశాలపై జిన్‌పింగ్‌తో చక్కటి సంభాషణ జరిగింది. ప్రపంచాన్ని మరింత భద్రంగా మార్చడానికి చేయాల్సిందంతా చేస్తాం అని ట్రంప్ ఉద్ఘాటించారు. అధ్యక్షుడిగా రెండో టర్మ్‌లో చైనా (China)తో సంబంధాలకు ఆయన ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు ప్రచారం సాగుతోంది.