Donald Trump : డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన.. జపాన్‌తో

జపాన్‌తో వాణిజ్య ఒప్పందంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక ప్రకటన చేశారు. జపాన్ (Japan) నుంచి తమ దేశంలోకి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 15 శాతం సుంకాలు విధంచనున్నట్లు ప్రకటించారు. ఈ ఒప్పందం వల్ల వేలాది ఉద్యోగాల (Jobs) సృష్టి జరుగుతుందని తెలిపారు. జపాన్‌తో అమెరికా (America) కు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ దేశం లో జపాన్ 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబోతోందని వెల్లడిరచారు. అలాగే అమెరికా ఉత్పత్తులకు జపాన్ తలుపులు తెరవబోతోందని అన్నారు. జపాన్‌పై ట్రంప్ గతంలో 25 శాతం టారిఫ్‌లు ప్రకటించారు. తాజాగా దాన్ని 15 శాతానికి తగ్గించడం గమనార్హం. ఈ సుంకాలు ఆగస్టు ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.