Donald Trump: సంచలన ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్

భారత్, పాక్ పరస్పర సైనిక చర్యలతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా ఉన్న వేళ కాల్పుల విరమణకు ఇరు దేశాలు సమ్మతించాయని అందరికంటే ముందే ప్రకటించి అభాసుపాలైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోమారు తొందరపాటు ప్రకటన చేశారు. టారిఫ్‌లు (Tariffs) విధించకుండానే అమెరికా (America) నుంచి వస్తూత్పత్తుల దిగుమతికి భారత్ (India) అత్యుత్సాహం చూపిస్తోందని ట్రంప్ అనూహ్య ప్రకటన చేశారు. దీంతో వెంటనే భారత్ స్పందించింది. అలాంటిదేమీ లేదని, టారిఫ్‌ల ఖరారుపై విసృతస్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, చర్చలు ఇప్పట్లో ముగిసిపోవని భారత్ స్పష్టం చేసింది. జీరో టారిఫ్ ప్రతిపాదన లేదని కుండబద్దలు కొట్టింది.