Scott Bessant :అమెరికా ఆర్థిక మంత్రిగా స్కాట్ బెస్సెంట్

అమెరికా ఆర్థిక మంత్రిగా బిలియనీర్ ఇన్వెస్టర్ స్కాట్ బెస్సెంట్ (Scott Bessant) నియామకానికి సెనెట్ ఆమోదం లభించింది. అభివృద్ధి మందగించకుండా అమెరికన్లపై పన్నులు తగ్గించడంతోపాటు దిగుమతులపై సుంకాలను విధించడం ద్వారా దానిని భర్తీ చేసుకోవడం కొత్త ఆర్థిక మంత్రి ముందున్న లక్ష్యం. సౌత్ కరోలినా(South Carolina)కు చెందిన స్కాట్ స్వలింగ సంపర్కుడు. ఒకప్పుడు డెమోక్రాటిక్ పార్టీ మద్దతుదారైన ఆయన వివాదాస్పద ఇన్వెస్టర్ జార్జి సొరోస్ (George Soros) కోసం పని చేశారు. సెనెట్ ఆర్థిక కమిటీ స్కాట్ నియామకాన్ని 16-11 ఓట్లతో ఆమోదించింది. ఇద్దరు డెమోక్రాట్ సభ్యులు (Democrat members) ఆయనకు మద్దతు పలికారు. ఆర్థిక మంత్రిగా ఆయన అధ్యక్షుడికి ద్రవ్య విధాన సలహాదారుగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ అప్పులను పర్యవేక్షిస్తారు. అధ్యక్షుడి జాతీయ ఆర్థిక మండలి సభ్యుడిగా ఉంటారు.