India : నా జోక్యం లేకుంటే భారత్, పాక్ యుద్ధం కొనసాగేది ..మరోసారి ట్రంప్ వ్యాఖ్య

సరైన సమయంలో తాను జోక్యం చేసుకోకుంటే భారత్, పాకిస్థాన్ (Pakistan ) ల మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉండేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మరోసారి వ్యాఖ్యానించారు. యుద్ధ విరమణ కోసం రష్యా అధ్యక్షుడు పుతిన్‌కిచ్చిన 50 రోజుల గడువును కుదిస్తున్నాని తెలిపారు. గాజాలో ఆకలి కేకల్లేవన్న ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహు (Netanyahu) అభిప్రాయంతో విభేదిస్తున్నాయని స్పష్టం చేశారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) తో కలిసి ఆయన స్కాట్‌లాండ్‌లోని టర్న్‌బెర్రీ గోల్ఫ్ రిసార్టులో మీడియా తో మాట్లాడారు. ప్రపంచంలో తాను 6 యుద్ధాలను ఆపానని ట్రంప్ తెలిపారు. వాణిజ్య ఒప్పందం చేసుకోబోనని హెచ్చరించడంతో భారత్` పాక్ దిగివచ్చి కాల్పుల విరమణకు అంగీకరించాయి. రష్యా అధ్యక్షుడికి ఇచ్చిన 50 రోజుల గడువును కుదిస్తున్నా, మూడేళ్ల యుద్ధానికి తెరదించేలా ఒప్పందానికి రావాలని హెచ్చరించా. సెప్టెంబరులోగా దిగివచ్చేలా రెండు వారాల కిందట భారీ సుంకాలను విధించా. సోమవారం నుంచి 10 నుంచి 12 రోజుల సమయమిస్తా. ఆగస్టు 9 కల్లా శాంతి చర్యలు కొలిక్క రావాలి. లేకుంటే ఆంక్షలు, సుంకాలు మరింత పెరుగుతాయి అని ట్రంప్ పేర్కొన్నారు.