Donald Trump: న్యూయార్క్ టైమ్స్ పై లక్ష కోట్లకు డొనాల్డ్ ట్రంప్ పరువు నష్టం దావా

తనపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) న్యూయార్క్ టైమ్స్ (New York Times) పత్రికపై పరువు నష్టం దావా వేశారు. ఫ్లోరిడా కోర్టు (Florida Court) లో 15 బిలియన్ డాలర్ల( సుమారు రూ.1.32 లక్షల కోట్లు) కు దావా వేసినట్టు చెప్పారు. చట్టవ్యతిరేక ప్రచారానికి ఆ పత్రిక ఏకైక అతిపెద్ద భాగస్వామిగా మారిందని ఆరోపించారు. రాడికల్ లెఫ్ట్ డెమొక్రాటిక్ పార్టీ (Democratic Party) గా బాకాగా మారిందని విమర్శించారు. దేశ చరిత్రలో దిగజారుడు పత్రికగా మారిందంటూ విమర్శించారు. తన కుటుంబానికి, వ్యాపారాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు.