Harvard University : వారి వివరాలు వెల్లడించాలి : డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump )హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University ) పై దాడిని కొనసాగించారు. వర్సిటీ ఎస్‌ఈవీపీ (Varsity SEVP ) హోదా రద్దును నిలిపేస్తూ తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన సమర్ధించారు. అక్కడ చదువుతున్నవారిలో 31 శాతం విదేశీ విద్యార్థులే ఉన్నారని, వారి పూర్తి వివరాలను వెల్లడిరచాలని ట్రంప్ తెలిపారు. అంతర్జాతీయ విద్యార్థుల (International students )ను చేర్చుకునే హోదాను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు నిలిపేసిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందించారు. హార్వర్డ్‌లో చదువుతున్నవారిలో 31 శాతం మంది విదేశీ విద్యార్థులే. పదేపదే ప్రభుత్వం అభ్యర్థించినప్పటికీ విశ్వవిద్యాలయ ఆయా విద్యార్థుల గురించి వివరాలను అందించడం లేదు. ఎందుకు చెప్పడం లేదు? వారిలో ఎక్కువ మంది అమెరికా వ్యతిరేక దేశాలకు చెందిన విద్యార్థులున్నారు. ఆయా విద్యార్థుల విద్య కోసం వారేమీ చెల్లించడం లేదు. ఆ విదేశీ విద్యార్థులు ఎవరో మేం తెలుసుకోవాలనుకుంటున్నాం అని ట్రంప్ పేర్కొన్నారు.