అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే… వాటిని ముందే విడుదల చేస్తా
2024 అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే అమెరికాలోని అత్యంత రహస్య విషయాలను బట్టబయలు చేస్తానని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. ఓ పాడ్కాస్ట్ కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగుపెడితే యూఎఫ్వో ( గుర్తుతెలియని ఎగిరే వస్తువు) దృశ్యాలు, మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్యకు సంబంధించిన పత్రాలు ఎప్స్టైన్ ఫైల్స్ వంటి రహస్యాలను బహిర్గతం చేస్తానని హామీ ఇచ్చారు. కెన్నడీ విషయంలో తనను డెమోక్రాట్లే ముందుకు నెడుతున్నారని ట్రంప్ పేర్కొన్నారు. ఇప్పటికే చాలా పత్రాలను తాను విడుదల చేసినట్లు తెలిపారు. చాలా మంది తన వద్దకు వచ్చిన అలా చేయవద్దని చెబుతున్నారు. కానీ, నేను వాటిని ముందే విడుదల చేస్తానని స్పష్టం చేశారు.






