Trump: ట్రంప్ వియ్యంకులకు కీలక పదవులు
త్వరలో అమెరికా అధ్యక్ష పదవి చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తన వియ్యంకులకు కీలక పదవులు కట్టబెట్టారు. లెబనీస్`అమెరికన్ వ్యాపారవేత్త అయిన మసాద్ బౌలోస్ (Massad boulos)ను అరబ్, పశ్చిమాసియా వ్యవహారాల సీనియర్ సలహాదారుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన ట్రంప్‌నకు వియ్యంకుడు. మసాద్ కుమారుడు మైఖేల్‌ను ట్రంప్ కుమార్తె టిఫానీ వివాహం చేసుకున్నారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో గాజా అంశంపై అసంతృప్తిగా ఉన్న అరబ్ అమెరికన్, ముస్లిం ఓటర్లను ట్రంప్ వైపునకు మళ్లించడంలో మసాద్ కీలకంగా పనిచేశారు. తన మరో వియ్యంకుడు ఛార్లెస్ కుష్నర్ (Charles kushner )ను ఫ్రాన్స్‌కు అమెరికా రాయబారిగా నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తన కుమార్తె ఇవాంకా ట్రంప్ మావయ్యే ఛార్లెస్ (జారెడ్ కుష్నర్ తండ్రి) ఈయన గతంలో ఓ కేసులో దోషిగా తేలగా, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో క్షమాభిక్ష పెట్టారు.






