Donald Trump : బెజ్రిల్‌కు భారీ షాక్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా బ్రెజిల్ (Brazil)కు భారీ షాకిచ్చారు. బ్రెజిల్ ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం సుంకం విధిస్తున్నట్టు ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి ఈ కొత్త సుంకం అమల్లోకి వస్తుందని అన్నారు. బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో (Jair Bolsonaro) కేసు విషయంలో అక్కడి ప్రభుత్వం అన్యాయంగా వ్యవహరిస్తుండటం, బ్రెజిల్‌తో అమెరికా (America) కు ఉన్న అధిక వాణిజ్య లోటును కారణాలుగా పేర్కొన్నారు. 2022 నాటి ఎన్నికల్లో ఓటమి తరువాత అధికారం నిలబెట్టుకునేందుకు కుట్ర పన్నినట్టు బోల్సోనారో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక బ్రెజిల్‌తో పాటు మరో ఏడు దేశాలపై కూడా ట్రంప్ సుంకాలను భారీగా పెంచారు. శ్రీలంక, ఇరాక్, లిబియా, ఆల్జీరియాలపై 30 శాతం, బ్రూనై, మాల్డోవాపై 25 శాతం, ఫిలిప్పీన్స్‌పై 20 శాతం సుంకాన్ని విధించబోతున్నట్టు తెలిపారు.