Ohio State: ఒహాయో రాష్ట్రం శుభవార్త.. హిందూ విద్యార్థులకు
అమెరికాలోని ఒహాయో రాష్ట్రం (Ohio State )లో హిందూ విద్యార్థుల(Hindu students ) కు ఆ రాష్ట్రం శుభవార్త చెప్పింది. అక్కడి పాఠశాలలో చదువుతున్న హిందూ విద్యార్థులకు 2025 నుంచి దీపావళి (Diwali holiday) సెలవు ఇస్తున్నట్లు ఇండో- అమెరికన్ చట్టసభ సభ్యుడు నీరజ్ అంటానీ(Neeraj Antony) తెలిపారు. ఇందుకు సంబంధించిన బిల్లుకు ఆ రాష్ట్ర గవర్నర్ మైక్ డివైన్ తాజాగా ఆమోదం తెలిపారు. గవర్నర్ ఆమోదించిన బిల్లు ద్వారా ఒహాయో రాష్ట్రంలోని ప్రతి హిందూ విద్యార్థి 2025 నుంచి దీపావళి సెలవు తీసుకోవచ్చు. దీంతో పాటు ఇప్పటికే భారత్లోని వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ఇస్తున్న ఉగాది, సంక్రాంతి వంటి మరో రెండు మతపరమైన సెలువులు కూడా హిందూ విద్యార్థులు తీసుకోవచ్చు. అమెరికా చరిత్రలో ఈ విధంగా దీపావళికి సెలవు ఇస్తున్న మొదటి రాష్ట్రం ఇదే. రాష్ట్రంలో హిందువులకు ఇది అద్భుతమైన విజయం అని నీరజ్ అంటానీ పేర్కొన్నారు.






