Harvard University : డొనాల్డ్ ట్రంప్‌కు చుక్కెదురు.. హార్వర్డ్‌కు ఊరట

హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University )లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలను అడ్డుకునేలా కార్యనిర్వాహక ఉత్తర్వు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు కోర్టు (Court) లో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఉత్తర్వును బోస్టన్ (Boston) లోని యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి అలిసన్ బరోస్ (Alison Burrows) తాత్కాలికంగా నిలిపివేశారు. ట్రంప్ విధించిన నిషేధాజ్ఞలు అమలైతే తమకు కోలుకోలేని దెబ్బ తగులుతుందంటూ న్యాయస్థానాన్ని హార్వర్డ్ ఆశ్రయించింది. విదేశీ విద్యార్థుల చేరికను అడ్డుకోకుండా కోర్టు ఇటీవలే ఆదేశాలు జారీ చేసిన సంగతిని గుర్తు చేసింది. దాన్ని పట్టించుకోకుండా దేశాధ్యక్షుడు స్వయంగా తాజా నిషేధాజ్ఞలు విధించారని పేర్కొంది. ఈ వాదనను పరిగణనలోకి తీసుకున్న జడ్జి ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వు అమలును ప్రస్తుతానికి నిలిపివేశారు.