Donald Trump : ట్రంప్ నోట మళ్లీ అదే పాట… ఉద్రిక్తతలు తగ్గాలంటే

భారత్ (India), పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే కారణమని పదే పదే చెప్పుకొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి ఇదే విషయం చెప్పారు. రెండు అణ్వాయుధ దేశాల మధ్య యుద్ధం రాకుండా తన మధ్యవర్తిత్వం దోహదపడిరదని అన్నారు. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలంటే భారత్, పాకిస్థాన్(Pakistan) కలిసి డిన్నర్ (Dinner ) చేయాలని సూచించారు. ప్రస్తుతం సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ట్రంప్ రియాధ్‌లో జరిగిన సౌదీ`అమెరికా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం సదస్సు సందర్భంగా మాట్లాడారు. భారత్, పాక్ మధ్య యుద్ధం జరిగి ఉంటే లక్షల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారని, అలాంటిది జరగకూడదనే తాను కోరుకున్నానని తెలిపారు. తనకు తాను శాంతి దూతగా ట్రంప్ చెప్పుకొన్నారు.