Donald Trump: డొనాల్డ్ ట్రంప్ రాకముందే.. మళ్లీ
అమెరికా నూతన అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది జనవరిలో గద్దె నెక్కబోతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ (Trump) వచ్చిన తర్వాత అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలవుతుందన్న అంచనాలు నెలకొన్నాయి. కానీ ఇప్పుడే ఆ వాతావరణం ఏర్పడటం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. నిజానికి ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) కంటే ఆ స్థానంలో ముందున్నది ట్రంపే. అప్పుడు ట్రంప్ దూకుడు చైనా (China) తో పరస్పర సుంకాలకు దారితీసింది. కానీ బైడెన్ రాకతో పరిస్థితులు కొంత శాంతించాయి. అయినప్పటికీ గత మూడేండ్లల్లో అమెరికా-చైనా మధ్య ఈ రకమైన పోరు వస్తూపోతూనే ఉన్నది. ఇప్పుడది తీవ్రరూపం దాల్చగా, ట్రంప్ రాకతో ఇంకెంత తీవ్రతను సంతరించుకుంటుందోనన్న ఆందోళనలు అంతటా వ్యాపిస్తున్నాయి.






