Canadian Cabinet అమెరికాతో కెనడా మంత్రుల మంతనాలు
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం కెనడా, మెక్సికో దేశాల ఎగుమతులపై 25 శాతం సుంకం విధించనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో (Justice Trudeau ) ట్రంప్‌తో ఇప్పటికే భేటీ అయ్యారు. డ్రగ్స్ అక్రమ రవాణాను సరిహద్దుల్లోనే కట్టడి చేయాలని, లేనిపక్షంలో సుంకాలు పెంచుతానంటూ ట్రంప్ ఆయనను హెచ్చరించినట్లు సమాచారం. అంతేకాదు, ఇందులో విఫలమైతే అమెరికాలో 51వ రాష్ట్రంగా చేరాలని ట్రూడోకు చురకలు అంటించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య మంత్రిగా ఎంపిక చేసిన హోవార్డ్ లూట్నిక్ (Howard Lutnick )తో కెనడా ఆర్థిక మంత్రి డొమినక్ లే బ్లాంక్(Dominic Le Blanc), విదేశాంగశాఖ మంత్రి మెలానీ జోలీ(Melanie Jolie) భేటీ అయ్యారు. ఈ భేటీపై కెనడా మంత్రులు మాట్లాడుతూ ఇరుదేశాల మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని చర్చలు జరపనున్నట్లు పేర్కొన్నారు.






