Trump : అసద్ పనైపోయింది : ట్రంప్
సిరియా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ (Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశం విడిచి పారిపోయిన సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ (Bashar al Assad) పనైపోయినట్టేనని పేర్కొన్నారు. ఆయనను కాపాడడంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ఇక ఏ మాత్రం ఆ సక్తి లేదన్నారు. ఇన్నాళ్లూ అసద్‌కు పుతిన్ రక్షకుడిగా నిలిచ్చారన్నారు. ఇక సిరియా యుద్ధానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎలాంటి లాభం లేదని తెలుసుకున్నారని వ్యాఖ్యానించారు. దీనికి క్రెయిన్‌తో యుద్ధం, దిగజారిన దేశ ఆర్థిక పరిస్థితి కారణమన్నారు. ఇరాన్ బలహీనపడానికి ఇజ్రాయెల్‌తో ఘర్షణే కారణమన్నారు.






