డొనాల్డ్ ట్రంప్‌నకు ఖరీదైన బహుమతులు
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు ఓ ఆన్లైన్ స్ట్రీమర్ ఇచ్చిన ఖరీదైన గిప్టులు చర్చనీయాంశంగా మారాయి. ట్రంప్ మార్ ఏ లాగో ఎస్టేట్‌లో అడిన్ రోస్ అనే ప్రముఖ స్ట్రీమర్తో కలిసి లైవ్ ఇంటర్వ్యూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతను ట్రంప్‌నకు బంగారంతో చేసిన రోలెక్స్ వాచీని, ప్రత్యేకంగా తయారు చేయించిన టెస్లా సైబర్ ట్రక్‌ను బహూకరించారు. ఈ సైబర్ ట్రక్‌పై ట్రంప్‌పై దాడి తర్వాత తీసిన ఫొటో, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్ రాయించారు. దీనిపై ట్రంప్ సంతోషం వ్యక్తం చేశారు. అద్భుతమైన బహుమతిగా దీనిని అభివర్ణించారు.






