Yogam-Amogham: అన్నమయ్యపురంలో “యోగం – అమోఘం”

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.శోభారాజు (Dr. Shoba Raju) అన్నమ్మయ్యపురంలో శనివారం ఉదయం 9 గంటలకు “యోగం అమోఘం” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా “హితం యోగశాల” అధ్యక్షులు శ్రీ రేవతి బండారుచే ఉచిత యోగా ప్రత్యేక కార్యక్రమం మరియు కూమారి యుక్తారెడ్డి వారి శిష్యులు కూచిపూడి నృత్య ప్రదర్శన, అన్నమాచార్య భావనా వాహిని శిష్యులచే ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమం చివరన ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. దయచేసి అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. వివరాలకు 9848024042 – సంప్రదించవలసిందిగా ప్రార్థన.