TTD: మరో వివాదంలో టీటీడీ.. వీఐపీ దర్శనాలు ఆగవా…?

ఓ వైపు తొక్కిసలాట ఘటనపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నా… తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారుల తీరు మాత్రం మారడం లేదు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వీఐపీ దర్శనాలు ఆపేశాము అని ప్రకటించిన అధికారులే మళ్ళీ ప్రముఖులకు దర్శనాలు కల్పించారు. శుక్రవారం నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు పలువురు వీవీఐపీలు. వారి లిస్టు ఒకసారి చూస్తే చాంతాడు అంత ఉంది.
యోగా గురు రాందేవ్ బాబా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ, తెలంగాణ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూధనాచారి, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్, తెలంగాణ మాజీ మంత్రి మల్లా రెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ మాజీ మంత్రి సునీత లక్ష్మ రెడ్డి వంటి వారు దర్శించారు.
అలాగే సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు (Rammohan naidu), ఏపి హోంమినిస్టర్ అనిత, ఏపీ రాష్ట్రమంత్రి కొలుసు పార్థసారథి, ఏపీ రాష్ట్రమంత్రి నిమ్మల రామానాయుడు, ఏపీ రాష్ట్ర మంత్రి సవిత, ఏపీ రాష్ట్ర మంత్రి సంధ్యారాణి, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణంరాజు, ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఏపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఏపీ ఎంపీ సీఎం రమేశ్, తెలంగాణ ఎంపీ డీకే అరుణ, ఏపీ రాజ్య సభ ఎంపీ ఆర్.కృష్ణయ్య, సినీ నిర్మాత బండ్ల గణేష్, సినీ నటుడు రాజేంద్రప్రసాద్, సినీ నటుడు సప్తగిరి, సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి, చాముండేశ్వరి నాథ్, బ్యాట్మెంటన్ పుల్లెల గోపీచంద్, వైసీపీ నుంచి వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు తిరుమల బాలాజీ ని దర్శించుకున్నారు. ఈ మేరకు పలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.