Dr. Shoba Raju: “వేసవి వెన్నెల” ఉచిత అన్నమయ్య కీర్తనల శిక్షణా తరగతులు

అన్నమాచార్య భావనా వాహిని సంస్థ గత 46 సంవత్సరాలుగా అన్నమయ్య కీర్తనల ప్రచారానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. పద్మశ్రీ డా. శోభారాజు (Dr. Shoba Raju) గారి ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా తన ముందుకు సాగే శోభారాజు గారి లాంటి వారి వద్ద కీర్తనలు నేర్చుకోవడం ఎంతో గొప్ప విషయం. నేర్చుకోవడం యోగం నేర్పించడమే భోగం అనే నినాదంతో సాగే “వేసవి వెన్నెల” ఎంత ఆదరణ పొందిందో అందరికీ తెలిసిందే. ఇపుడు అన్నమాచార్య సంకీర్తనలు నేర్పే మరో బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నారు.
వయసుతో నిమిత్తం లేకుండా, సంగీత పరిజ్ఞానం లేకుండా, గాత్రం ఎలా ఉన్నా ఎవరైనా కీర్తనలు నేర్చుకోవచ్చు. 617 అన్నమయ్య జయంతి సందర్భంగా ఈ సంవత్సరం మే 6 వ తేదీ 2025 నుండి మే 10 వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం 6 గం. ల నుండి 7:30 గం. ల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు.
ఆసక్తి ఉన్నవారు, వివరాలకు రమణ గోరింట్ల 9848024042 / శ్రీమతి సుమలత +919866240561 / శ్రీమతి పరిమళ +919966002879నంబర్లను సంప్రదించి తప్పనిసరిగా తమ పేర్లు నమోదు చేసుకొనగలరు.