Tirumala: శ్రీవారి ఆలయంలో వైభవంగా ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది (Ugadi) ఆస్థానం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతం అనంతరం శుద్ధి నిర్వహించి, శ్రీదేవి (Sridevi) , భూదేవి (Bhudevi) సమేత శ్రీమలయప్పస్వామికి, విష్యక్సేనుల వారికి విశేష సమర్పన చేశారు. విమానాప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపు చేసి ఆలయంలోకి ప్రవేశించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లకు బంగారు వాకిలో సర్వభూపాల వాహనంపై వేంచేపు చేశారు. శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేసిన తర్వాత పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వద్ద ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు. శ్రీపెద్దజీర్ స్వామి (Sripeddajeer Swamy) , శ్రీచిన్నజియర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు, పేష్కార్ రామకృష్ణ, శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్‌దీక్షితులు, అధికారులు పాల్గొన్నారు.