టీటీడీ బోర్డు ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా.. ఈవో ప్రమాణం

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ధర్మకర్తల మండలి ఎక్స్‌ఆఫిషియో సభ్యుడిగా టీటీడీ ఈవో జె.శ్యామలరావు తిరుమల శ్రీవారి ఆలయం ప్రమాణం చేశారు. ఆలయంలోని బంగారు వాకిలి వద్ద టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్నాక రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా అదనపు ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.