TTD: తిరుమలలో ముగిసిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం

వైకుంఠ ద్వార దర్శనాల టోకెన్ల జారీ కేంద్రాల వద్ద తొక్కిసలాట ఘటన దృష్టిలో ఉంచుకొని రథసప్తమి(Ratha Saptami) కి పటిష్ట ఏర్పాట్లు చేశాము. సూర్యజయంతి పురస్కరించుకొని ఘనంగా ఏర్పాట్లు చేశాం. రథసప్తమి వేడుకలకు రెండు లక్షమంది వచ్చే అవకాశంతో తగిన ఏర్పాట్లు. 4వ తేదీన ఉదయం 5:30 నుంచి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం జరుగుతుంది. ఆరోజున ఏడు వాహన సేవలపై శ్రీవారు దర్శనమిస్తారు.
రథ సప్తమి కారణంగా పలు ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు. ఫిబ్రవరి 3 వ తేదీన తిరుపతి(Tirupati) సర్వ దర్శన, కాలినడక టికెట్లు రద్దు. రూ.300/- దర్శన టిక్కెట్లు కలిగిన భక్తులు నిర్ధేశిత సమయానికి రావాలి. గ్యాలరీలో వెళ్ళే ప్రవేశ,నిష్కరణ మార్గాలు ఏర్పాటు చేశాం. మాడవీధుల్లో వాహనసేవలను తిలకించేందుకు వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా ఆహార పాణ్యాలు పంపిణి.
ఆలయం చుట్టూ సీనియర్ అధికారులతో పర్యవేక్షణ. వేసవి తాపం, చలి కలగకుండా షెడ్లు ఏర్పాటు. ఎనిమిది లక్షల లడ్డూలను బంపర్ స్టాక్ లో పెట్టుకుంటాం. ప్రయాగరాజ్ శ్రీవారి నమూనా ఆలయాన్ని రోజుకు పది వేల మంది దర్శించుకుంటున్నారు. చక్కగా ప్రయాగరాజ్ లో పనిచేస్తున్న టీటీడీ సిబ్బందికి ధన్యవాదాలు. వైకుంఠ ద్వార దర్శన తొక్కిసలాట ఘటన పై జ్యుడీషియల్ విచారణ జరుగుతోంది.