Ramchander Rao: ఉజ్జయినీ మహంకాళిని దర్శించుకున్న తెలంగాణ బీజేపీ చీఫ్

తెలంగాణ బీజేపీ (BJP) అధ్యక్షుడు రామచంద్ర రావు (Ramchander Rao) ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయన, తన ఎదుగుదలకు అమ్మవారి ఆశీస్సులే కారణమన్నారు. తెలంగాణ ప్రజలకు శాంతి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు తెలిపారు. భక్తి, ఉత్సాహం, సంప్రదాయాల పరిమళంతో బోనాల పండుగను జరుపుకుంటున్న ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, హిందూ సంప్రదాయాల పరిరక్షణకు బీజేపీ (BJP) ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన (Ramchander Rao) స్పష్టం చేశారు. ఆలయాలపై దాడులకు పాల్పడేవారికి ప్రజాస్వామ్యబద్ధంగా తగిన గుణపాఠం చెబుతామని ఈ సందర్భంగా రామచంద్ర రావు (Ramchander Rao) హెచ్చరించారు.