వైభవంగా శ్రీసత్యసాయి జయంతి వేడుకలు

ఆధ్యాత్మిక బోధనలతో ప్రపంచ మానవాళిని సేవామార్గం వైపు నడిపించిన ప్రేమమూర్తి సత్యసాయి 99వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తజన సందోహం నడుమ వేణుగోపాలస్వామి రథోత్సవంతో వేడుకలను ప్రారంభించారు. అంతకు ముందు సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి సత్యనాయణస్వామి వ్రతాన్ని వేదపండితులు నిర్వహించారు.