Sri Ram Navami: శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానం

శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి (Sri Ram Navami) ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ(Sri Seetharamalakshmana) సమేత హనుమంతుడి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం (Thirumanjanam) శాస్త్రోక్తంగా నిర్వహించారు. హనుమంత వాహనం (Hanuman Vahanam ) పై శ్రీరాముడు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రాత్రి 9 నుంచి 10 గంటల నడుమ బంగారు వాకిలి వద్ద శ్రీరామనవమి ఆస్థానాన్ని నిర్వహించారు. సోమవారం శ్రీరామ పట్టాభిషేకం, అనంతరం రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం నిర్వహించనున్నారు.