Dubai: దుబాయ్‌లో వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు

దుబాయ్ (Dubai)లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆజ్మాన్‌లో జరిగిన సీతారాముల కల్యాణోత్సవంలో పెద్ద సంఖ్యలో భారతీయులు పాల్గొన్నారు. తెలంగాణ భక్తి బృందం ఆధ్వర్యంలో గణపతి పూజ (Ganpati Puja), హనుమాన్ చాలీసా (Hanuman Chalisa) పఠనం సాగాయి. స్థానిక వేద పండితుడు సతీష్ (Satish) బృందం ఆధ్వర్యంలో తెలుగు వారు కుటుంబసమేతంగా రామాయణం పారాయణం చేశారని తెలంగాణ ప్రవాసీలు గాజా నవినీత్, వంశీగౌడ్ తెలిపారు. వేడుకల ఏర్పాట్లను ఆరే శరత్, కృష్ణా మేగి, మదన్ మోదన్, జగదీశ్ సమన్వయం చేశారు.