Annamayyapuram: అన్నమయ్యపురంలో అంగ రంగ వైభవంగా శ్రీ కృష్ణ జయంతి

అన్నమయ్యపురం (Annamayyapuram)లో, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు గారి ఆధ్వర్యంలో, జరుగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్న 12గం.లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగగా, సాయంత్రం 4 గం.లకు ఉట్టి కొట్టే కార్యక్రమం నిర్వహించారు.
తదుపరి 5 గం.ల నుండి అన్నమ స్వరార్చన మరియు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు.
తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం, గురు స్తుతి నిర్వహించారు.
తదుపరి “ఎస్.వి.ఎస్. కళా నికేతన్” సంస్థ కూచిపూడి నృత్య గురువు “డా. హేమ వనసర్ల” గారి నిర్వహణలో వారి శిష్యులు “అనూష, కీర్తన, సాధిక, సనంద, ఎస్. వైష్ణవి, యజ్ఞప్రియ, అపరనిధి, ఎం. హర్షిని, దేశ్య శ్రీ, లక్ష్మి సాయి, వర్షిత, మోక్ష, హేమన్య, శ్రీ దర్శిని, మనస్విని, హర్ష, శ్రీ జస్విత, ఎం. ధన్విత, సి. హెచ్. తేజాక్షిత, బి. ఆరాధ్య రెడ్డి, వై. మనన్య, కే. అక్షయ, సాయి ప్రణవి, జి. ఆరాధ్య, ఎస్. రిత్విక, బి. ఆరాధ్య, ఎం. మోక్షిత, వి. భార్గవి, భవ్య శ్రీ, లాస్య, ప్రియకర్త, వరేణ్య, శ్రేష్ట, వి. అష్టోత్తర, భవిష్య, సహస్ర, వేద శ్రీ, కృతిక, వైష్ణిక, నవ్య శ్రీ, వి. నేహా, ఆర్. జస్మిత, సాయి శ్రీ, పి. హష్విత, జి. హుమిష శ్రీ, పి. జాహ్నవి శ్రీ వల్లీ, కావ్యశ్రీ గనోజు, తనిష్క జల్లేపలి, పి. శ్రీకృతి, కనిష్క, భవ్య, చైత్రిక, దీక్షిత, హొన్నేష, సహస్ర, కనీష, రాధ మానస, వర్ణిక” సంయుక్తంగా “వినాయక కౌత్వం, గోదా కళ్యాణం, భద్రశైల రాజమందిర, పలుకే బంగారమాయెనా, అష్టలక్ష్మీ, పుష్పాంజలి, తారంగం, జనుత శబ్దం, రామ చంద్రాయ, ముద్దుగారె యశోద, బాలకనకమయా” అనే చక్కని కీర్తనలకు తమ అద్భుతమైన నృత్య ప్రదర్శనలతో అందరిని ఆహ్లాదపరిచారు.
డా. శోభారాజు గారు శ్రీ కృష్ణ జయంతిని ఉద్దేశించి శ్రీ కృష్ణ లీలలు వివరిస్తూ, తన అనుభవాలను జోడించి నవ యువతను ఉత్తేజపరిచారు.
తదనంతరం కళాకారులను సంస్థ మేనేజింగ్ ట్రస్టీ డా. నందకుమార్ గారు, సంస్థ వ్యవస్థాపకులు పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు గారు జ్ఞాపికను అందించారు.
చివరిగా శ్రీ స్వర సిద్ధి వేంకటేశ్వర స్వామి వారికి మంగళ హారతులు అందించి విచ్చేసిన భక్తులందరికీ పసందైన శ్రీ కృష్ణ నవనీతం మరియు రుచికరమైన ప్రసాద వితరణ చేశారు.