Dr. Shobha Raju: కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో శోభా రాజు “సరస్వతి” గానం

కాళేశ్వరంలో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతి పుష్కరాల సందర్భంగా చివరి రోజు 26వ తేది సోమవారం సాయంత్రం శోభా రాజు (Dr. Shobha Raju) గారు, వారి శిష్య బృందం “మానస పటేల్, అభిరామ్, శ్రద్ధ, చైత్ర, సువర్ణ, అక్షయ, జనని, రన్విత” సంయుక్తంగా “గణరాజ గుణరాజ, చాలదా హరినామ, కొండలలో నెలకొన్న కోనేటి” అనే బహుళ ప్రాచుర్యం పొందిన అన్నమయ్య సంకీర్తనలు పాడారు.
తర్వాత పుష్కరం సందర్భంగా “శ్రీ సరస్వతి ” దేవి అనుగ్రహముతో శోభా రాజు గారు స్వీయ రచన, స్వరపరచిన “సరస్వతి సరస్వతి సరస్వతి కురుసన్నిదౌ” అనే ఒక నూతన సంకీర్తన చాలా చక్కగా కచేరీ చేశారు. వీరికి కీ బోర్డు కళ్యాణ్, తబలా పాండు వాయిద్య సహకారం అందించారు. చివరిగా, కార్య నిర్వాహకులు శోభా రాజు గారిని ప్రశంసించి, గౌరవ సత్కారాలు అందించారు.